సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 18:39:04

ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ప‌నితీరు దేశానికే ఆద‌ర్శం : మ‌ంత్రి కేటీఆర్

ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ప‌నితీరు దేశానికే ఆద‌ర్శం : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : చైర్మ‌న్‌గా డా.ఎర్రోళ్ల‌ శ్రీ‌నివాస్ అధ్య‌క్ష‌త‌న ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ప‌నితీరు దేశానికి ఆద‌ర్శ‌మ‌ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ‌నివారం ప్రగతి భవన్ లో మంత్రి కేటిఆర్‌ను ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా ఎర్రోళ్ళ శ్రీనివాస్ అధ్యక్షతన సభ్యులు విద్యాసాగర్,  రాంబల్ నాయక్, నీలాదేవిలు క‌లిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  

ఛైర్మన్ డా. ఎర్రోళ్ళ శ్రీనివాస్ అధ్యక్షతన కమిషన్ అనేక నూతన కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు భరోసా నింపుతూ దేశానికి  మార్గదర్శకంగా నిలిచిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా క‌మిష‌న్‌ ఈ నెల 5, 6, 7 తేదీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్న జన అదాలత్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్  ను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.