e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వ‌స్తుంటాయి..

ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వ‌స్తుంటాయి..

ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వ‌స్తుంటాయి..

ఆహారం మ‌నల్నిబ‌తికించేదే కాకుండా మ‌న‌ల్ని చంపేదిగా కూడా త‌యారైంది. శ‌రీర ఆరోగ్యం కోసం తింటున్న ఆహారం విష‌తుల్యంగా మారి మ‌నుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి చెందడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఐన‌ప్పటికీ వాటి నుండి ఇతర వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎప్పుడూ పొంచి ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రకారం ప్రపంచంలో ఏటా దాదాపు 4.20 లక్షల మంది ప్రజలు రక్షితంకాని ఆహారాల‌తో వ్యాప్తి చెందుతున్న వ్యాధుల కార‌ణంగా చ‌నిపోతున్నారు.

బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాల ద్వారా ఆహారం నుంచి వ్యాప్తి చెందుతున్న వ్యాధులు మానవుల సాధారణ ఆరోగ్యంపై ప్ర‌ధానంగా ప్ర‌భావం చూపుతాయి. అదేవిధంగా మ‌న‌ ఆర్థిక శ్రేయస్సు, పర్యాటక రంగం, హోటళ్ళు వంటి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. క‌రోనా కాలంలో ఆహార భ‌ద్ర‌త‌ను ఎలా కాపాడుకోవాలో.. ఎలా మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవాలో ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిందే..

ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వ‌స్తుంటాయి..

మాంసం కొనుగోలు చేసిన‌ప్పుడు ప్యాకింగ్‌పై తొలుత ప్యాకేజింగ్ తేదీని గ‌మ‌నించాలి. ఎలాంటి వాతావ‌ర‌ణంలో ప్యాకింగుల‌ను పెడుతున్నారో చూడాలి. మాంసం ఇంటికి తీసుకురాగానే ఫ్రిజ్‌లో పెట్ట‌కుండా వండేయాలి. ప‌చ్చి మాంసాన్ని గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద రెండు గంట‌ల కన్నా ఎక్కువ స‌మ‌యం ఉంచ‌కూడ‌దు. ప‌చ్చి మాంసాన్ని వేసే గిన్నెల‌ను ప‌రిశుభ్రంగా తోముకోవ‌డం చాలా అవ‌స‌రం.

ప్యాకుల‌పై ఇవి గ‌మ‌నించండి..

ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వ‌స్తుంటాయి..

ఎలాంటి ఆహారాల ప్యాకేజీల‌నైనా ఇంటికి తెచ్చేముందు వాటిపై కంపెనీ ముద్ర‌, హాలోగ్రామ్‌, ఆ ఆహారం త‌యారీలో వాడిన ప‌దార్థాలు, ఉత్ప‌త్తి, గ‌డువు తేదీల‌ను గ‌మ‌నించాలి. అలాగే ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉన్న‌వి, త‌క్కువ సోడియం ప‌దార్థాలు, హోల్ వీట్ ప‌దార్థాలు, మ‌ల్టీ గ్రేన్ వంటి వాటిపై ఎక్కువ‌గా దృష్‌టి పెట్టాలి. రెడీ టు యూజ్ ప‌దార్థాల‌ను ఎంత త‌క్కువ‌గా వాడితే ఆరోగ్యానికి అంత మంచిద‌ని గుర్తుంచుకోవాలి.

ఇంట్లో ఆరోగ్య సంర‌క్ష‌ణ ఇలా..

ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వ‌స్తుంటాయి..

ఇంట్లో చేతుల‌తోపాటు వంట‌కు ఉప‌యోగించే ప‌దార్థాల‌ను, వంట సామ‌గ్రిని, పాత్ర‌ల‌ను శుభ్రప‌రుచుకోవాలి. క‌లుషితం కాకుండా చూసుకునేలా ఆహార ప‌దార్థాల‌ను వేరువేరుగా ఉంచాలి. స‌రైన విధంగా ఆహారం ఉడికేలా చూడాలి. స‌రైన స‌మ‌యం మేర‌కే ఫ్రిజ్‌లో వ‌స్తువుల‌ను ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉండే వ‌స్తువుల‌ను అప్పుడ‌ప్పుడు గ‌మ‌నిస్తూ గ‌డువు ముగిసిన వ‌స్తువుల‌ను బ‌య‌ట‌కు తీయాలి. వంటింట్లో చెత్త‌ను ఎప్పటిక‌ప్పుడు బ‌య‌ట వేస్తుండాలి. సింక్‌లో పాచి ఉండ‌కుండా చూసుకోవాలి.

ఎంత వేడిలో ఉడికించాలంటే..?

ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వ‌స్తుంటాయి..

చికెన్‌, ట‌ర్కీ కోడి వంటి పౌల్ట్రీతోపాటు మేక‌, గొర్రె మాంసాల‌ను 74 సెంటీగ్రేడ్ వ‌ద్ద ఉడికించ‌డం శ్రేయ‌స్క‌రం. చేప‌ల‌ను 63 డిగ్రీల వ‌ద్ద‌నే ఉడికిస్తే చాలు.

వేటిని ఎన్ని రోజులు ఫ్రిజ్లో పెట్టాలంటే..

ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వ‌స్తుంటాయి..

ఆహార ప‌దార్థాలను ఫ్రిజ్‌లో పెట్టేందుకు కూడా స‌మ‌యం సంద‌ర్భాలు ఉంటాయంట‌. అవ‌కాడోల‌ను 3, 4 రోజులు, బీన్స్ 3-5 రోజులు, బ్ర‌కోలి 3-5 రోజులు, క్యారెట్ రెండు వారాలు, మొక్క‌జొన్న రెండు రోజులు, పుట్ట‌గొడుగులు వారం రోజులు, వంకాయ‌లు 4 రోజులు, ప‌చ్చి మిర్చి 4-14 రోజులు, బీర‌కాయ 4 రోజుల వ‌ర‌కు మాత్ర‌మే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

అదేవిధంగా పండ్ల‌లో యాపిల్ 4 వారాలు, చెర్రీలు 4 రోజులు, బెర్రీలు 5 రోజులు, అంగూర్ 7 రోజులు, క‌ర్బూజా 2 వారాలు, పైనాపిల్ పండ్ల‌ను వారం రోజుల పాటు మాత్ర‌మే ఫ్రిజ్‌లో దాచుకోవాలి.

ఇక‌పోతే వెన్న నెల రోజులు, పాలు వారం రోజులు, ప‌న్నీర్ ఒక వారం, చీజ్ స్ల‌యిస్ 3 వారాలు, పెరుగు రెండు వారాల పాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

బాబోయ్ ఎండ‌లు : దుబాయ్‌లో మండుతున్న‌ సూరీడు

మ‌రింత శ‌క్తి : వ‌చ్చే నెల‌లో భార‌త్‌కు అమెరికా సీహాక్ హెలీకాప్ట‌ర్స్‌

పుణె ప‌రిశోధ‌న : క‌రోనా కొత్త వేరియంట్ గుర్తింపు

రిత్ర‌లో ఈరోజు.. ఆలిండియా రేడియోగా నామ‌క‌ర‌ణం

కొత్త సేవ‌లు : స్పీడ్ పోస్ట్‌లో అస్తిక‌ల నిమ‌జ్జ‌నం

ఇమ్యూనిటీ బూస్ట‌ర్ : ప‌న‌స గింజ‌ల్లో దాగి ఉన్న ఆరోగ్యం

జీ 7 స‌మ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్‌సిగ్న‌ల్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వ‌స్తుంటాయి..

ట్రెండింగ్‌

Advertisement