పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో సంచలనం. సెర్బియా లెజెండరీ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ అనామక ఆటగాడి చేతిలో ఓడి మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. తొలి రెండు సెట్లు గెలిచి 2-0తో నిలిచిన దశలో వరుసగా మూడు సెట్లు కోల్పోయి అనూహ్యంగా ఓడిపోయాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో 28వ సీడ్ జావో ఫోన్సెకా (బ్రెజిల్) 4-6, 4-6, 6-3, 7-5, 7-5తో మూడో సీడ్ జొకోవిచ్‌కు షాకిచ్చాడు.
స్పెయిన్ ఆటగాడు పాబ్లో కారెనో బుస్టా 7-6 (0), 7-5, 3-6, 6-4తో అర్జెంటీనా ప్లేయర్ తిరాంతెను ఓడించగా.. రుబ్లెవ్ 7-5, 7-6 (7/2), 7-6 (7/2)తో నునో బోరగ్స్పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో పోలెండ్ స్టార్ స్వియాటెక్ 6-4, 6-4తో మగ్దా లినెట్‌ను ఓడించగా.. ఏడో సీడ్ స్వితోలినా 6-2, 6-3తో కార్పాచ్పై, ఎనిమిదో సీడ్ ఆండ్రీవా 6-4, 6-2తో మేరీ బౌజ్కోవాపై నెగ్గి ముందంజ అయితే, అన్‌సీడెడ్ టీచ్‌మన్ 6-1, 7-5తో గత సీజన్ రన్నరప్ కరోలినా ముచోవాకు షాకిచ్చింది.