ఈ ప్రేమకథ ‘రోమాంచకం’
అర్జున్ రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన నిర్మాణ సంస్థ భద్రకాళీ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న తాజా తెలుగు చిత్రానికి ‘రోమాంచకం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు.
అర్జున్ రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన నిర్మాణ సంస్థ భద్రకాళీ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న తాజా తెలుగు చిత్రానికి ‘రోమాంచకం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
శుక్రవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. యూత్‌ఫుల్ అండ్ పొయొటిక్ ఫీల్‌తో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్‌లైన్ కథపై ఆసక్తినిరేకెత్తిస్తున్నది. నవ్యత కలబోసిన ప్రేమకథా చిత్రమిదని, త్వరలో మరిన్ని అప్డేట్స్ అందిస్తామని మేకర్స్ తెలిపారు. ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వాసుకి వైభవ్, సమర్పణ: సందీప్‌రెడ్డి వంగా, నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగా, రచన-దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

