మరింత శక్తి : వచ్చే నెలలో భారత్‌కు అమెరికా సీహాక్ హెలీకాప్టర్స్
భారత నావికాదళం ఇప్పుడు మరింత శక్తి వంతం కానున్నది. వచ్చే నెలలో రెండు సీహాక్ హెలికాప్టర్లు భారతదేశానికి రానున్నాయి. మొత్తం 24 సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్ ఒప్పందం చేసుకున్నది

న్యూఢిల్లీ : భారత నావికాదళం ఇప్పుడు మరింత శక్తి వంతం కానున్నది. వచ్చే నెలలో రెండు సీహాక్ హెలికాప్టర్లు భారతదేశానికి రానున్నాయి. మొత్తం 24 సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్ ఒప్పందం చేసుకున్నది. ప్రపంచంలోని ఉత్తమ ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్లు సముద్ర ఓడలు, జలాంతర్గాములను గుర్తించడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.
జూలై నెలలో రెండు అందనుండగా.. మిగతావి ఈ ఏడాది చివరలో అందుబాటులో ఉంటాయని నేవి అధికారులు చెప్తున్నారు. ఈ హెలికాప్టర్లను నడిపేందుకు దాదాపు 15 మంది నేవీ అధికారులు ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఈ శిక్షణ సోమవారం నుంచి అమెరికా నగరమైన ఫ్లోరిడాలోని పెన్సకోలాలో ప్రారంభమైంది.
రోమియో సీహాక్ హెలికాప్టర్లను లాక్‌హీడ్-మార్టిన్ కంపెనీ తయారు చేస్తున్నది. గత ఏడాది ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం.. అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. 24 హెలికాప్టర్ల ఖర్చు దాదాపు రూ.17,500 కోట్లు. ఒప్పందం ప్రకారం అమెరికా 2024 నాటికి అన్ని హెలికాప్టర్లను భారత్‌కు అందజేయాలి. గత 15 ఏండ్లలో తొలిసారిగా భారత ప్రభుత్వం నేవీ కోసం హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నది. ఈ సీహాక్ హెలికాప్టర్లు భారత నావికాదళంలోని బ్రిటిష్ సీకింగ్ హెలికాప్టర్లను భర్తీ చేయనున్నాయి. సీకింగ్ హెలికాప్టర్లు 20 ఏండ్ల క్రితమే సేవల నుంచి రిటైర్ అయ్యాయి.
సీహాక్తో ఎన్నో సేవలు
సీహాక్ హెలికాప్టర్లో ఏజీఎం-114 హెల్ఫైర్ క్షిపణి, ఎంకే 54 టార్పెడో, అధునాతన సాంకేతిక ఆయుధాలు ఉంటాయి. ఈ డబుల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను యుద్ధనౌకలు, క్రూయిజర్లు, విమాన వాహక నౌకల నుంచి కూడా నడపే వీలున్నది. రోమియోగా ప్రసిద్ది చెందిన ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్, జలాంతర్గాములను గుర్తించడం, నిఘా, సమాచారం, లక్ష్య శోధన, రెస్క్యూ, తుపాకీ కాల్పులు, లాజిస్టిక్ విభాగాల్లో విశేష సేవలందిస్తాయి.
ఇవి కూడా చదవండి..
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
రిత్రలో ఈరోజు.. ఆలిండియా రేడియోగా నామకరణం
కొత్త సేవలు : స్పీడ్ పోస్ట్‌లో అస్తికల నిమజ్జనం
ఇమ్యూనిటీ బూస్టర్ : పనస గింజల్లో దాగి ఉన్న ఆరోగ్యం
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్‌సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

