ముల్లన్పూర్ : ఐపీఎల్19వ సీజన్లో బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96) మెరుపులకు.. రాజస్థాన్ రాయల్స్ పోరాటానికి తెరపడింది. 15 ఏండ్ల ఈ యువ కెరటం ఆడిన మరో అద్భత ఇన్నింగ్స్ ఆ జట్టును ఫైనల్ చేర్చలేకపోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104) క్లాసిక్ సెంచరీతో చేసిన గర్జనకు తోడు సాయి సుదర్శన్ (32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) సత్తా చాటడంతో రాజస్థాన్‌కు చెక్ పెట్టిన గుజరాత్ టైటాన్స్ మూడోసారి తుదిపోరుకు దూసు కెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో జీటీ 7 వికెట్ల తేడాతో రాయల్స్‌ను చిత్తు చేసింది. ఆర్ఆర్ ఇచ్చిన 215 టార్గెట్‌ను 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లలో 214/6 స్కోరు చేసింది. వైభవ్‌తోపాటు జడేజా (45నాటౌట్) చివర్లో ఫెరీరా (11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 నాటౌట్) కూడా రాణించారు. హోల్డర్, రబాడ చెరో రెండు వికెట్లు తీశారు. గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో ఆర్సీబీతో జీటీ అమీతుమీ తేల్చుకోనుంది.
క్వాలిఫయర్-1లో తేలిపోయిన గుజరాత్ టాపార్డర్ ఈసారి అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు సుదర్శన్, గిల్ తొలి వికెట్‌కు 167 రన్స్ జోడించి ఫైనల్‌కు బాట వేశారు. భారీ ఛేదనలో క్లాసిక్ షాట్లతో హోరెత్తించారు. ఏ ఒక్క బౌలర్‌ను వదలకుండా శిక్షించి ఛేజింగ్‌ను వన్‌సైడ్ చేశారు. ఫామ్‌లో ఉన్న ఆర్చర్ తొలి ఓవర్లోనే చెరో రెండు ఫోర్లతో తమ ఉద్దేశం ఏంటో చెప్పారు. ఆర్చర్‌ను టార్గెట్ చేసిన గిల్ మరో రెండు ఫోర్లు రాబడితే.. బర్గర్, తుషార్‌కు సుదర్శన్ రెండేసి బౌండరీలతో స్వాగతం పలికాడు. ఓపెనర్ల జోరుకు పవర్‌ప్లేను 69/0తో ముగించింది. ఆ తర్వాత గిల్గేరు మార్చి మరింత స్పీడు పెంచారు. తుషార్ వేసిన తొమ్మిదో ఓవర్లో 6,4,4 బాది 30 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు వంద దాటించాడు. పదో ఓవర్లో బంతిని అందుకున్న జడేజాను 6,6,4తో శిక్షించడంతో స్టేడియం హోరెత్తింది. కెప్టెన్‌ను చూసి సుదర్శన్ సైతం వేగం అందుకున్నాడు. యశ్‌రాజ్ బౌలింగ్‌లో తొలి సిక్స్ కొట్టి అర్ధ శతకం అందుకున్నాడు. ఈ జోరు చూస్తుంటే ఇద్దరే లక్ష్యాన్ని కరిగించేలా కనిపించారు. కానీ, బ్రిజేశ్ వేసిన 13వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన సాయి.. ఐదో బాల్‌ను కట్ షాట్‌తో బౌండరీకి పంపే ప్రయత్నంలో జారి పోయిన బ్యాట్ వికెట్లపై పడటంతో గత మ్యాచ్ మాదిరిగా హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. జడ్డూ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టి సెంచరీ (47 బంతుల్లో) పూర్తి చేసుకున్న గిల్‌ను తర్వాతి ఓవర్లో ఆర్చర్ ఎల్బీ చేసినా అప్పటికే మ్యాచ్ జీటీ చేతుల్లోకి వచ్చేసింది. తెవాటియా (17 నాటౌట్), సుందర్ (16), బట్లర్ (9 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు.
తన స్టయిల్‌కు భిన్నంగా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడిన వైభవ్ ముందుండి నడిపించగా.. చివర్లో ఫెరారీ మెరుపు బ్యాటింగ్‌తో రాజస్థాన్ మంచి స్కోరు చేసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఆ టీమ్‌కు ఆరంభంలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. సిరాజ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ జైస్వాల్ (1)ను ఔట్ చేయగా.. రెండో ఓవర్లో జురెల్ (7)ను రబాడ వెనక్కుపంపడంతో ఆర్ఆర్ 9/2తో నిలిచింది. అయితే నాలుగో నంబర్లో వచ్చిన జడేజాతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. పిచ్ నుంచి అంతగా సహకారం లేకపోవడం.. ప్రత్యర్థి పేసర్లు షార్ట్ పిచ్ బాల్స్, బౌన్సర్లతో పరీక్షిస్తుండగా.. వైభవ్ తన శైలికి భిన్నంగా జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బాల్స్‌ను మాత్రం శిక్షించాడు. సిరాజ్ వేసిన మూడో ఓవర్లోనే మూడు ఫోర్లు కొట్టిన అతను రబాడ వేసిన 153 కి.మీ స్పీడ్ బంతిని స్ట్రెయిట్ సిక్స్‌గా కొట్టడం ఇన్నింగ్స్‌కే హైలైట్. మరో ఎండ్‌లో జడేజా కూడాక్రమం తప్పకుండా బౌండరీలు రాబట్టడంతో పవర్‌ప్లేను రాజస్థాన్ 70/2తో ముగించింది.

చేతి నొప్పి కారణంగా జడేజా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా.. తొమ్మిదో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ పరాగ్ (11) 4,6 కొట్టి ఔటయ్యాడు. అతనితో పాటు షనక (3)ను హోల్డర్ పెవిలియన్ చేర్చగా.. మధ్యలో ప్రసిధ్ బౌలింగ్‌లో వైభవ్ ఇచ్చిన క్యాచ్‌ను సుదర్శన్ డ్రాప్ చేశాడు. అప్పటికి 46 రన్స్ వద్ద ఉన్న వైభవ్ ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. ప్రసిధ్ బౌలింగ్‌లో ఆర్చర్ (7) కీపర్‌కు చిక్కడంతో 118/5తో నిలిచిన జట్టును సూర్యవంశీ ఆదుకున్నాడు. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతను మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా తోడుగా స్పీడు పెంచాడు. రబాడ, సిరాజ్ ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టిన వైభవ్.. హోల్డర్ వేసిన 16వ ఓవర్లో 4,6,6తో స్కోరు 150 దాటించాడు. ఆపై స్పిన్నర్ సుందర్‌ను రెండు సిక్సర్లతో శిక్షించిన వైభవ్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, 18వ ఓవర్లో రబాడ షార్ట్ పిచ్ బాల్‌ను అప్పర్ కట్ షాట్ ఆడిన సూర్య.. ప్రసిధ్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. ప్రసిధ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, స్పిన్నర్ రషీద్ వేసిన ఆఖరి ఓవర్లో నాలుగు సిక్సర్లతో విరుచుకుపడిన ఫెరీరా జట్టుకు మంచిస్కోరు అందించాడు.
రాజస్థాన్: 20 ఓవర్లలో 214/6 (వైభవ్ 96, జడేజా 45 నాటౌట్, హోల్డర్ 2/27, రబాడ 2/35);
గుజరాత్: 18.4 ఓవర్లలో 219/3 (గిల్ 104, సుదర్శన్ 58, ఆర్చర్ , బర్గర్1/35)
1 ఒక సీజన్లో 700 పరుగులు పూర్తి చేసిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్ వైభవ్. 2023లో జైస్వాల్ సాధించిన 625 పరుగుల రికార్డును అధిగమించాడు.
19 19 ఈ సీజన్ ప్లేఆఫ్స్ రెండు మ్యాచ్‌ల్లో వైభవ్ కొట్టి సిక్సర్లు, ఒక ఎడిషన్ ప్లేఆఫ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా వృద్ధిమాన్ సాహా ( 2014లో 11) రికార్డును దాటేశాడు.
521 ఈ ఐపీఎల్ పవర్‌ప్లేలో వైభవ్ సూర్యవంశీ చేసిన రన్స్. ఒక సీజన్లో అత్యధిక పవర్ ప్లే రన్స్ చేసిన బ్యాటర్‌గా 2016లో వార్నర్ నెలకొల్పిన 467 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.
5 ఐపీఎల్లో గిల్‌కు ఇది ఐదో సెంచరీ. కెప్టెన్‌గా రెండోది.