TS EdCET 2024 | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ గురువారం నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో జరిగే ఈ పరీక్షకు 33,789 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ ఏడాది పరీక్షను మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్నది. పరీక్షల నిర్వహణకు 79 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేశారు. తెలంగాణలోని పలు పట్టణాలతోపాటు ఏపీలో విజయవాడ, కర్నూల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం, మధ్యా హ్నం జరిగే పరీక్షకు ఆలస్యంగా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని, అభ్యర్థులు పరీక్షకు 90 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరువాలని ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ మృణాళిని సూచించారు. అభ్యర్థులు ఎడ్సెట్ వెబ్సైట్ను సంప్రదించి హాల్టికెట్లు పొందాలని తెలిపారు.