ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 3 : మునుగోడు ఉప ఎన్నికల్లో ముమ్మాటికీ ఎగిరేది గులాబీ జెండాయేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు.
మునుగోడు నియాజకవర్గంలో ఇటీవల గట్టుప్పల్ మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. యావత్ విద్యార్థి, యువత బీజేపీని పాతర వేసే కార్యక్రమంలోనే ఉన్నారని, మునుగోడు ప్రజలు పట్టం కట్టేది టీఆర్ఎస్కేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల, ఇక్కడ ఆ పార్టీని విశ్వసించే స్థాయిలో మునుగోడు ప్రజలు లేరని తుంగ బాలు స్పష్టం చేశారు.