యాదాద్రి, అక్టోబర్ 28: కోట్లు ఆశచూపి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయినా బీజేపీ బుద్ధి మారడం లేదు. స్వామిజీలతో తమకేం సంబంధం లేనట్టు ఆ పార్టీ నేతలు మాట్లాడుతుండటం ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నది. అబద్ధాలతో పబ్బం గడుపుకొనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘కొనుగోళ్ల వ్యవహారం’ నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త డ్రామా ప్రారంభించారు. ప్రలోభాలతో తమకేం సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీనరసింహుడిగా సాక్షిగా నిస్సిగ్గుగా ప్రకటించారు. యాదాద్రికి సంజయ్ రావడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించాయి. ఆలేరు నియోజకవర్గ పరిధిలోని సుమారు 1200 మంది బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. బండి గోబ్యాక్, తొండి గోబ్యాక్, యాదాద్రి ఆలయాన్ని అపవిత్రం చేయవద్దు అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ ఎదుట సంజయ్, రఘునందన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు దిక్కుమాలిన పని అంటూ రోడ్డు మీదే బైఠాయించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సందర్భంగా ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకేం సంబంధం లేదని ప్రధాని మోదీ, అమిత్‌షాలు యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ దొంగ ప్రమాణాలను ప్రజలు నమ్మరని.. గుడి కాదు, గుడిలో లింగాన్ని మింగే ఘనుడు బండి అని విమర్శించారు. అతి పవిత్రమైన యాదాద్రి దేవాలయాన్ని సంజయ్ అపవిత్రం చేశారని ఆరోపించారు. పీఠాధిపతులంటే గొప్ప గౌరవమున్నదని, స్వామిజీలతో నీతిమాలిన పనులు చేయిస్తున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
బీజేపీకి ఎలాంటి సంబంధం లేదట !
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు, రాష్ట్ర బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, స్వామిజీలు పార్టీ ప్రతినిధులు కారని బండి సంజయ్ రొటీన్ డైలాగ్‌తో ప్రమాణం చేశారు. అంతేకానీ జాతీయ పార్టీకి, మోదీ, అమిత్ షాలకు సంబంధం లేదని మాత్రం చెప్పలేదు. సుమారు 50 కార్లతో యాదాద్రి చేరుకొన్న సంజయ్ పర్యటనలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం చూపారు. ప్రధానాలయ ముఖ మండపంలో అలజడి సృష్టించారు. సెల్‌ఫోన్ నిషేధమున్నా యథేచ్ఛగా వినియోగించారు. ఆలయ పరిసరాల్లో రాజకీయ కార్యక్రమాలు, ప్రసంగాలు చేయకూడదు. వీటిని తుంగలో తొక్కుతూ రాజకీయ నినాదాలు చేస్తూ ఆలయ పవిత్రతకు భంగం కల్పించారు.
సీ. గార్దభంబున కేల – కస్తూరి తిలకంబు?
మర్కటంబున కేల – మలయజంబు?
శార్ధూలమున కేల – శర్కరాపూపంబు?
సూకరంబున కేల – చూతఫలము?
మార్జాలమున కేల – మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల – కుండలములు?
మహిషాని కేల ని – ర్మలమైన వస్త్రముల్?
బకసంతతికి నేల – పంజరంబు?
తే. ద్రోహచింతన జేసెడి – దుర్జనులకు
మధురమైనట్టి నీనామ – మంత్రమేల?
భూషణవికాస శ్రీధర్మ – పురనివాస
దుష్టసంహార నరసింహ – దురితదూర