Huzurabad | పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల

కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత హుజూరాబాద్ మండలంలోని గ్రామాల ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదట పోతిరెడ్డిపేట, ఆఖరున శంభునిపల్లి ఓట్లను లెక్కించనున్నారు.
ఉదయం 9:30 గంటలకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

