Ranjit Reddy Homage to Dasharathi | నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి స్వాతంత్య్రోద్యమ వేళ తెలంగాణలో ఉద్యమ చైతన్యం కలిగించిన గొప్ప తెలంగాణ వైతాళికుడు, కవి, ఉద్యమకారుడు దాశరథి కృష్ణమాచార్యులు అని టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. అగ్నిధార పేరుతో తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మన తెలంగాణ సాహితీ సౌరభం, గొప్ప కవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య అని తెలిపారు.
దాశరథి సాహిత్య రంగంలో చేసిన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ఆయన పేరున అవార్డును అందిస్తున్నదని రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది దాశరథి రంగాచార్య పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. తెలంగాణ వైతాళికులను గౌవరవించుకోడం మన కర్తవ్యమన్నారు. నేటి యువత దాశరథిని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mukesh Ambani @ London | లండన్లోనూ ముకేశ్ అంబానీ ఇల్లు.. చూడ్డానికి రెండు కండ్లు చాలవేమో !
Petrol Price | దిగొస్తున్న ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?
Stock market | స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్ కు ఎందుకు అంత ప్రాధ్యాన్యత ఇస్తారో తెలుసా..?
UAE power from waste | యూఏఈ సెన్సేషన్.. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం..!