UAE power from waste | యూఏఈ సెన్సేషన్.. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం..!
UAE power from waste | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకున్నది. ఈ నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశం ఇది.

UAE power from waste | ముడి చమురు ఉత్పత్తి చేసే గల్ఫ్ దేశాల్లో ఒకటైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది. వ్యర్థాలతో ఎడారులు నింపకుండా సదరు వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించనున్నది. వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ). ఈ నిర్ణయంతో పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఏకీభవించట్లేదు.
వ్యర్థాలతో ఉత్పత్తి చేసే గ్రీన్హౌస్ గ్యాస్ ఇంటెన్సివ్తో పర్యావరణ ముప్పు పొంచి ఉందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కానీ వ్యర్థాల విలువ సదరు పర్యావరణ పరిరక్షణ సంస్థలకు తెలియదని వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ బీయాహ్ ఇంజినీర్ నౌవ్ వాజిర్ చెప్పారు. ఈ ఏడాదిలో షార్జాలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పాదక యూనిట్ ప్రారంభం కానుంది.

ఏటా మూడు లక్షల టన్నులకు పైగా వ్యర్థాలతో 28 వేల ఇండ్లకు విద్యుత్ సరఫర చేయొచ్చునన్నారు. దుబాయిలో 120 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో వ్యర్థాలతో మరో విద్యుత్ ఉత్పాదక యూనిట్ ఏర్పాటు కానున్నది. 2024 నాటికి ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి కానున్నది. దీనికి 1.9 మిలియన్ టన్నుల వ్యర్థాలను వినియోగించుకోనున్నది. దీంతో ఏడాదిలో దుబాయిలోని 45 శాతం ఇండ్లకు విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

