Mukesh Ambani @ London | లండన్‌లోనూ ముకేశ్ అంబానీ ఇల్లు.. చూడ్డానికి రెండు కండ్లు చాలవేమో !
Mukesh Ambani @ London | భారత్ కార్పొరేట్ దిగ్గజం.. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ తాజాగా లండన్‌లోనూ ఓ ఇల్లు నిర్మించుకున్నారు.

Mukesh Ambani @ London | భారత కార్పొరేట్ దిగ్గజం.. ఆసియాలోకెల్లా అతిపెద్ద కుబేరుడు.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. త్వరలో లండన్‌కు తన కుటుంబాన్ని షిఫ్ట్ చేయనున్నారా.. ఈ ఏడాది దీపావళి వేడుకలను లండన్‌లో ఇటీవల నిర్మించిన కొత్త ఇంట్లోనే ముకేశ్ అంబానీ కుటుంబం జరుపుకున్నదని ఓ ఆంగ్ల పత్రిక ఓ వార్తాకథనం వండి వార్చింది.
ముంబై.. లండన్ల్లోనూ ముకేశ్ ఫ్యామిలీ జీవనం..
ముంబైతోపాటు లండన్‌లోనూ ముకేశ్ అంబానీ కుటుంబం జీవించనున్నదని ఆ ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం. కరోనా మహమ్మారి నేపథ్యంలో సెకండ్ హోం అవసరం ఉందని ఆయన కుటుంబం భావించినట్లు తెలుస్తోంది. ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్డులో నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గల విలాసవంతమైన ఇంటికి ముకేశ్ అంబానీ.. అంటిల్లా అని నామకరణం చేశారు. కరోనా లాక్డౌన్ వేళ ఆయన కుటుంబం గుజరాత్‌లోని జామ్నగర్లోనే గడిపింది. ఇదే జామ్‌నగర్‌లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పెట్రోకెమికల్ రిఫైనరీ ఫ్యాక్టరీని రిలయన్స్ నడుపుతోంది.

ఆగస్టులో ఇంటి నిర్మాణం మొదలు..
ముంబైలో మాదిరిగానే లండన్‌లోనూ ఓపెన్ స్పేస్‌లో ఇల్లు నిర్మించాలని ముకేశ్ అంబానీ కోరుకున్నారట. అయితే, ముంబైలో మాదిరిగా టవర్ మాదిరిగా కాదట. గతేడాది నుంచి నూతన ఇంటి కోసం ఆయన అన్వేషణ ప్రారంభించారని తెలుస్తోంది. లండన్‌లోని బకింగ్హంషైర్- స్టోక్ పార్క్‌లో కంట్రీ క్లబ్‌కు సమీపాన ఇంటి నిర్మాణానికి అవసరమైన 300 ఎకరాల భూమి కొనుగోలు కోసం ఈ ఏడాది ప్రారంభంలో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఆగస్టులోనే నిర్మాణం మొదలైన ఇల్లు ఇప్పుడు సిద్ధం అయినట్లు తెలుస్తున్నది.
ఏప్రిల్‌లో పూర్తిగా లండన్‌కు షిఫ్ట్
సాధారణంగా ఇండియన్స్ తమ సొంతూళ్లోనే దీపావళి పండుగ జరుపుకుంటారు. కానీ ముకేశ్ అంబానీ కుటుంబం మాత్రం లండన్‌లోని తమ కొత్త ఇంట్లో ఈ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారని రూఢీ అవుతోంది. దీపావళి వేడుకల తర్వాత త్వరలో ఇండియాకు ఆయన కుటుంబం వస్తుందని.. వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తిగా లండన్‌కు షిప్ట్ అవుతారని సమాచారం.

మెడికల్ ఆర్ట్ ఫెసిలిటీతో లండన్ ఇల్లు
పూర్తిగా మెడికల్ ఆర్ట్ ఫెసిలిటీతో లండన్ ఇంటిని నిర్మించుకున్నారని తెలుస్తోంది. అంతే కాదు.. లండన్‌లోని ముకేశ్ అంబానీ కొత్త ఇంటిలో బ్రిటిష్ వైద్యుడి సారధ్యంలో మినీ హాస్పిటల్ కూడా ఏర్పాటు కానున్నది. అయితే, లండన్‌లో కొత్తింటి విషయమై ముకేశ్ అంబానీ కుటుంబం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగనీ ధ్రువీకరించలేదు కూడా.. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీ ప్రపంచంలోని కుబేరుల్లో 11వ వారు. ఆయన వ్యక్తిగత నికర సంపద రూ.7 లక్షల కోట్లపై చిలుకే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి:
Mukesh Ambani @ London | లండన్‌లోనూ ముకేశ్ అంబానీ ఇల్లు.. చూడ్డానికి రెండు కండ్లు చాలవేమో !
Petrol Price | దిగొస్తున్న ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?
Stock market | స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్ కు ఎందుకు అంత ప్రాధ్యాన్యత ఇస్తారో తెలుసా..?
UAE power from waste | యూఏఈ సెన్సేషన్.. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Mukesh Ambani
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

