Petrol Price | దిగొస్తున్న ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?

ముంబై : ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగడంతో, దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 నుంచి కిందకు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు మరింతగా ఇబ్బదులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గత మూడేండ్లలో మొదటిసారి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఈ కారణంగా చాలాచోట్ల డీజిల్ ధరలు రూ. 100 దిగువకు వచ్చాయి. పలురాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు కాస్త తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు కాస్త తగ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి.
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించకపోవడంతో పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే తగ్గుతుంది. అసోం, మణిపూర్, గోవా, త్రిపుర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపునకు రాష్ట్రాలు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం తగ్గింపు మాత్రమే అమలు జరుగు తున్నది. ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో తెలంగాణలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కేంద్రం పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ కారణంగా కేంద్ర ఎక్సైజ్ సుంకంపై రాష్ట్రంలో వ్యాట్ తగ్గడంతో హైదరాబాద్లో పెట్రోల్పై రూ.6.33, డీజిల్పై 12.79 చొప్పున తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ లీటర్ ధర రూ.114.51 నుంచి రూ.108.18కు, డీజిల్ రూ.107.40 నుంచి రూ.94.61లుగా ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

