మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 22:23:24

విద్యుదాఘాతంతో టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి

విద్యుదాఘాతంతో టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి మొద్దు అమరేందర్‌రెడ్డి(35) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. సాయంత్రం తన పొలం వద్ద ఈ ప్రమాదం జరిగింది. టీఆర్‌ఎస్‌ యువజన విభాగంలో చురుకైన నాయకుడిగా ఆయనకు పేరుంది. పార్టీ కార్యక్రమాల్లో అమరేందర్‌రెడ్డి ముందుండేవాడు. ఆయన అకాల మృతిపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఉదయం కొంగరకలాన్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో కలిసి హరితహారం కార్యక్రమ ప్రారంభంలో పాల్గొన్న అమరేందర్‌రెడ్డి మృతి చెందాడన్న వార్త విని పలువురు ఆవేదనకు లోనయ్యారు. అమరేందరెడ్డికి భార్య మాసన, కూతురు ఉన్నారు.


logo