Nitanshi Goel | మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్.. సంప్రదాయ లుక్‌లో అదరగొట్టిన ‘లాపతా లేడీస్’ హీరోయిన్
Laapataa Ladies | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్లో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies). అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. జమ్తారా(Jamtara) వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ (Sparsh Shrivastav) ఈ మూవీలో హీరోగా నటించగా.. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు.
Laapataa Ladies | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్లో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies). అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. జమ్తారా(Jamtara) వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ (Sparsh Shrivastav) ఈ మూవీలో హీరోగా నటించగా.. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. నితాన్షి గోయల్ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా చూసిన ప్రేక్షకులు మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఫూల్ కుమారి అనే పెళ్లి కూతురు పాత్రలో నటించిన నితాన్షి గోయల్(Nitanshi Goel)పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే నితాన్షి గోయల్ ఫుల్ పాపులర్‌గా మారింది.
ఇదిలావుంటే.. తాజాగా నితాన్షి గోయల్ (Nitanshi Goel) అమెరికాలో జరుగుతున్న మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్లో సందడి చేసింది. లాపతా లేడీస్‌లో తన పాత్ర ఎలా ఉంటుందో అలానే ఎర్ర చీరలో సంప్రదాయ లుక్‌లో ఈ ఫ్యాషన్ ఫెస్టివల్లో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్ ఎక్స్ టీం వేదికగా వెల్లడించింది. మెట్ గాలా అనేది ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో జరిగే ఫ్యాషన్ ఫెస్టివల్. ప్రపంచంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Our Phool blossoming in the garden of time 🌼
Watch #LaapataaLadies on @NetflixIndia now.@nitanshi_goel @PratibhaRanta #SparshShrivastava @ravikishann #AamirKhan @raodyness #JyotiDeshpande @AKPPL_Official @KindlingIndia @jiostudios @TSeries @bookmyshow @PicturesPVR… pic.twitter.com/4JFWU19Szs— Aamir Khan Productions (@AKPPL_Official) May 7, 2024
లాపతా లేడీస్ కథ విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లి అయిన ఓ జంట పెళ్లి అనంతరం ఇంటికి వస్తుండగా మధ్యలో తన భార్య మిస్ అవుతుంది. అయితే ఈ విషయం తెలియక వరుడు తన భార్య అనుకుని వేరే అతడి భార్యను ఇంటికి తీసుకువస్తాడు. తీరా ఇంటికి వచ్చిన చూసిన అనంతరం తన భార్య కాదని షాక్ అవుతాడు. దీంతో తన భార్య పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తాడు. అయితే తన భార్య ఎలా మిస్ అయ్యింది. తన భార్య స్థానంలో వచ్చిన అమ్మాయి ఎవరు. ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఏంటి అనే స్టోరీతో ఈ సినిమా వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

