కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు గెల్లు శ్రీనివాస్ యాదవ్(టీఆర్ఎస్), ఈటల రాజేందర్(బీజేపీ), బల్మూరి వెంకట్(కాంగ్రెస్) తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఎన్నిక ఫలితం వెలువడనుంది.