యూరియా యాప్ తిప్పలు.. స్మార్ట్ఫోన్ కోసం రైతుల అప్పులు
రేవంత్ సర్కారు యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ రైతులను అప్పులపాలు చేస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లికి చెందిన రైతు దాసరాజులు బిచ్చయ్యకు పదెకరాల భూమి ఉన్నది.
కోడేరు, ఫిబ్రవరి 9 : రేవంత్ సర్కారు యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ రైతులను అప్పులపాలు చేస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లికి చెందిన రైతు దాసరాజులు బిచ్చయ్యకు పదెకరాల భూమి ఉన్నది. యాసంగిలో ఏడెకరాల్లో వరి.. మిగిలిన దాంట్లో మామిడి తోట సాగు చేశాడు. వరి పంటకు యూరియా అవసరం కాగా.. కోండ్రావుపల్లి ప్రాథమిక సహకార సంఘం వద్దకు సోమవారం వెళ్లాడు. అక్కడ స్మార్ట్ ఫోన్లలో యాప్ ద్వారా యూరియాను రైతులు బుకింగ్ చేస్తున్నారు. తనది ఫీచర్ ఫోన్ కావడంతో బుక్ చేయడానికి అవకాశంలేదని అక్కడి సిబ్బంది సూచించారు. దీంతో రైతు తప్పని పరిస్థితిలో రూ.14 వేలు అప్పు చేసి స్మార్ట్ ఫోన్ కొనుగోలుచేశాడు.
ఈ సందర్భం గా రైతు మాట్లాడు తూ.. గతంలో యూరియా అవసరం ఉన్న రైతు లు పట్టా పాస్బుక్కు, ఆధార్ జిరాక్స్ ఇస్తే అవసరం ఉన్నంత యూరియా ఇచ్చేవారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడంతో యూరియా బుక్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడ్తున్నారని వాపోయారు. ఆన్లైన్ విధానంతో రైతులకు తీవ్రనష్టం జరుగుతున్నదని, తనలాంటి చదువురాని రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- farmers
- loans
- smartphones
- urea app
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

