దామరచర్ల, అక్టోబర్ 10: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేటతండాకు చెందిన గిరిజన యువకుడు సాయిసిద్ధుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాడపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవహక్కుల కమిషన్ నల్లగొండ ఎస్పీకీ ఆదేశాలు జారీచేసింది. గత నెలలో జరిగిన ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫిర్యాదుపై ఎస్సీ,ఎస్టీ కమిషన్, మానవహక్కుల సంఘం, జాతీయ మానవహక్కుల క మిషన్ స్పందించాయి.
వివరాల్లోకి వెళి తే.. కొత్తపేటతండాకు చెందిన ఆటో డ్రైవర్ సాయిసిద్ధు బంధువులకు యూరియా తీసుకొచ్చేందుకు ఆటోలో మిర్యాలగూడ వెళ్లగా.. అక్కడ రైతులు నిర్వహంచిన ధర్నాలో పాల్గొన్నాడు. దీంతో సెప్టెంబర్ 9న వాడపల్లి పోలీసు లు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి.. కులం పేరుతో తిడుతూ యూరియా కోసం ఆందోళన చేస్తావా అంటూ ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కాళ్లపై బలంగా లాఠీతో కొట్టడంతో నడవలేని స్థితిలో ఉన్నాడు. మహబూబాద్ కు చెందిని సామాజికవేత్త రేవంత్ జాతీ య మానవహక్కుల సంఘానికి ఫిర్యా దు చేయడంతో కమిషన్ స్పందించి బాధ్యులైన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.