దామరచర్ల, ఏప్రిల్ 28: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో 108 అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. సొంగతండాకు చెందిన గిరిజన మహిళ రమావత్ అంజలి (21) అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.
సొంగతండాకు చెందిన రమావత్ అంజలికి పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బంది సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది తక్షణమే చేరుకుని, అంజలిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు ఎక్కువయ్యాయి. పరిస్థితిని గమనించిన సిబ్బంది, పక్కకు ఆపి అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం చేశారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది సైదయ్య, ఎర్రబెల్లి శ్రీనివాస్‌ను అంజలి బంధవులు, మిర్యాలగూడ వైద్యులు అభినందించారు.