హైదరాబాద్, జనవరి10 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ట్రిబ్ విడుదల చేసింది. ఈ మేరకు ట్రిబ్ చైర్మన్ బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ట్రిబ్ వెబ్సైట్ https://treirb.cgg.gov.inలో జాబితాను ఉంచినట్టు పేర్కొన్నారు. ఎంపికైన 96 మంది అభ్యర్థులకు ఆయా సొసైటీలు మరోసారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి నియామకపత్రాలు అందజేస్తాయని తెలిపారు.
జేఏవో పోస్టులను భర్తీచేయండి : వీఏవోఏటీ
హైదరాబాద్, జనవరి10 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్(జేఏవో) పోస్టులను భర్తీ చేయాలని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(వీఏవోఏటీ) ప్రభుత్వాన్ని కోరింది. 2018 నుంచి ఈ పోస్టులు భర్తీకాకపోవడంతో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ పోస్టులను తక్షణమే భర్తీచేయాలని డిమాండ్ చేసింది.
శుక్రవారం మింట్కాంపౌండ్లో జరిగిన వీఏవోఏటీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో వీఏవోఏటీ నేతలు మాట్లాడారు. 2004 నాటికి విధుల్లో చేరిన విద్యుత్తు ఉద్యోగులను ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు మార్చాలని కోరారు. కార్యక్రమంలో జెన్కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు అనురాధ, సుధామాధురి, తిరుపతిరెడ్డి, వీఏవోఏటీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.