TREA | ఎల్-నినో ప్రభావంతో వర్షాలు పడట్లే.. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నీటి వాడకం ఎలాగంటే..?
TREA : కేంద్ర జల సంఘం (CWC) తాజా వివరాల ప్రకారం.. జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వ సాధారణ స్థాయి కంటే 16-46 శాతం తక్కువగా ఉందిని టీఆర్ఈఏ పేర్కొంది.
TREA : వర్షాకాలం మొదలైనప్పటికీ ఫసిఫిక్ మహాసముంద్రలో నెలకొన్న ఎల్నినో కారణంగా తెలంగాణలో వర్షాలు పడడం లేదని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ (TREA) తెలిపింది. కేంద్ర జల సంఘం (CWC) తాజా వివరాల ప్రకారం.. జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వ సాధారణ స్థాయి కంటే 16-46 శాతం తక్కువగా ఉందిని టీఆర్ఈఏ పేర్కొంది.
రాష్ట్రంలో నీటి కొరత ఉన్నప్పటికీ… ఎల్లప్పుడూ ప్రవహించే ప్రాణహిత, గోదావరిలో వినియోగయోగ్యమైన వరద ప్రవాహాలు అందుబాటులో ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లిఫ్టుల వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడం అత్యంత సమంజసమని టీఆర్ఈఏ బృందం అభిప్రాయపడింది. మేడిగడ్డ జలాశయ కనిష్ఠ డ్రా-డౌన్ స్థాయి (MDDL) +93.500 మీటర్లు కాగా, ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్నందున వరద నీటి మట్టం సుమారు +97.500 మీటర్లుగా ఉందని
DocScanner 9 Jul 2026 7-06 pm(1)
తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ (TREA) తెలిపింది. ఈ హెడ్ ఆధారంగా కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకు సుమారు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉందని టీఆర్ఈఏ పేర్కొంది. ఎల్ నినో ఫలితంగా వర్షాలు పడని పరిస్థితుల్లో అందుబాటులోని నీటి వనరులు ఎలా వినియోగించుకోవాలో సూచించింది.
అన్నారం, సుందిల్ల నిల్వ స్థాయిలు:
నీరు సాఫీగా వెళ్లడానికి అన్నారం బ్యారేజీని +116.500 మీటర్లు (5.1 టీఎంసీ), సుందిల్ల బ్యారేజీని +126.500 మీటర్ల (3.78 టీఎంసీ) MDDL స్థాయిల వద్ద నిల్వ చేయాలి. గతంలో ప్రాణహిత వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కుల పైస్థాయికి చేరిన రికార్డులు ఉన్నాయి; కాబట్టి సాంకేతిక నియమాలకు లోబడి 8.8 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసినా గ్రామాల ముంపు గానీ, ఆస్తి, ప్రాణ నష్టాలు గానీ జరగవు.

ఎల్-నినో సంక్షోభం నేపథ్యంలో పంటలను, రైతులను కాపాడేందుకు కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే వినియోగంలోకికి తేవాలని టీఆర్ఈఏ డిమాండ్ చేస్తోంది.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ లక్ష్య సాధన కోసం తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ తమ సేవలను స్వచ్ఛందంగా అందించడానికి సిద్ధంగా ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

