హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సరుకు రవాణా (కార్గో) ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై టీఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ ఫుడ్స్ నుంచి బాలామృతం, విజయా వంట నూనె సహా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన పలు సరుకులను రవాణా చేస్తున్న టీఎస్ ఆర్టీసీ.. తాజాగా ప్రభుత్వ కాలేజీలతోపాటు జిల్లా, మండల కేంద్రాలకు ఇంటర్, డిగ్రీ, పీజీ పాఠ్యపుస్తకాలను రవాణా చేసేందుకు తెలుగు అకాడమీతో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఈ సేవలను విజయవంతంగా కొనసాగిస్తున్నట్టు ఆర్టీసీ కార్గో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఇంచార్జి జగన్ తెలిపారు. తమ జోన్ నుంచి కార్గో బల్క్ బుకింగ్ ద్వారా 15 రకాల సరుకులు రవాణా చేస్తున్నామని, తద్వారా ప్రతి నెలా దాదాపు రూ.3 కోట్ల వరకు ఆదాయం వస్తున్నదని పేర్కొన్నారు. దీన్ని భవిష్యత్తులో