హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని భావించామని, ఒకవేళ కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో రిజర్వేషన్లు దక్కేవని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మా ట్లాడారు.
42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నించామని, బీజేపీ సహకరించలేదని పేర్కొ న్నారు. రిజర్వేషన్ల కేటాయింపు శాతాలపై ఉన్నతాధికారులు తప్పకుండా వివరణ ఇస్తారని చెప్పా రు. రిజర్వేషన్లను అడ్డుకుంటున్న వారిపై పోరాడాలని బీసీ సంఘాలను కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తరఫున ఏవైనా లోపాలుంటే చూపించాలని పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా బలహీనవర్గాల బిడ్డ బండి సంజయ్ బీసీ బిల్లు ఆమోదించేందుకు చొరవ చూపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.