హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 7 నుంచి 20 వరకు నిరుడు అక్టోబర్లో నిలిచిపోయిన ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. బదిలీలు, పదోన్నతులను ఆన్లైన్లో చేపట్టాలని కొన్ని సంఘాలు, ఆఫ్లైన్లో అని మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో ఏకాభిప్రాయంతో రావాలని ఆయా సంఘాలకు సూచించినట్టు తెలిపారు. తాజాగా 5,563 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభిస్తాయి.