గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 02:14:01

పలువురు కలెక్టర్ల బదిలీ

పలువురు కలెక్టర్ల బదిలీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం పలువురు కలెక్టర్లను బదిలీచేసింది. ముగ్గురికి స్థానచలనం కల్పించడంతోపాటు మరో ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మెదక్‌కు హన్మంతరావు, సంగారెడ్డికి వెంకట్రామిరెడ్డి, సిద్దిపేటకు భారతీ హోళికెరీని బదిలీచేసింది. పెద్దపల్లి జిల్లా అదనపు బాధ్యతలు కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంకకు, మంచిర్యాల అదనపు బాధ్యతలు ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌కు అప్పగించింది.