9మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏఎస్పీ స్థాయి అధికారులకు ప్రమోషన్లు, కొత్త పోస్టింగులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏఎస్పీ స్థాయి అధికారులకు ప్రమోషన్లు, కొత్త పోస్టింగులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసం ఈ బదిలీలు చేపట్టినట్టు ప్రభుత్వం పేరొన్నది.
బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో సూచించారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ ఎస్ చిత్తరంజన్‌ను అదే జి ల్లాకు అడిషనల్ ఎస్పీ(పరిపాలన)గా నియమించారు. కామారెడ్డి ఏఎస్పీ బొకా చైతన్యరెడ్డిని సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ(పరిపాలన)గా బదిలీ చేశారు. అక్కడి అడిషనల్ ఎస్పీగా సీహెచ్ రఘునందన్‌రావుకు స్థానచలనం కల్పించారు. జనగామ ఏఎస్పీ చేతన్ నితిన్‌ను జగిత్యాల అడిషనల్ ఎస్పీ(పరిపాలన)గా నియమించారు.
భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్ను మెదక్ అడిషనల్ ఎస్పీ(పరిపాలన)గా బదిలీ చేశారు. అక్కడి ఏఎస్సీ మ హేందర్కు స్థానచలనం కల్పించారు. వరంగల్ ఏఎస్పీ నగ్రాలే శుభమ్ప్రకాశ్ను నిజామాబాద్ అడిషనల్ డీసీపీ(పరిపాలన)గా నియమించారు. నిజామాబాద్ ఏఎస్పీ జీ బ స్వారెడ్డికి స్థానచలనం కల్పించారు. భైంసా అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనాను వనపర్తి అడిషనల్ ఎస్పీ (పరిపాలన)గా బదిలీ చేశారు. పీ మౌనికకు ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ (పరిపాలన)గా స్థానచలనం కల్పించారు. నిర్మల్ ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్ భైంసా ఏఎస్పీ/ఎస్డీపీవోగా బదిలీ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొఠేను ఉట్నూరు ఏఎస్పీ/ఎస్డీపీవోగా నియమించారు. బదిలీ అయిన రఘునందన్‌రావు, మహేందర్, బస్వారెడ్డిలను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
గవర్నర్‌ను కలిసిన సీఎస్, ఏజీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావు, హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన, న్యాయ అంశాలపై వారు గవర్నర్‌తో చర్చించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

