బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 11:18:25

వనపర్తి జిల్లాలో విషాదం.. నలుగురు అనుమానాస్పద మృతి

వనపర్తి జిల్లాలో విషాదం.. నలుగురు అనుమానాస్పద మృతి

వనపర్తి : వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి ఆజీరాం బీ (63), కుమార్తె ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజాపాష (42), మనుమరాలు హసీన (10) ఇంట్లో వేర్వేరుచోట్ల విగతజీవులై పడి ఉన్నారు. వంటగదిలో ఆజీరాం బీ మృతదేహాన్ని, డైనింగ్‌ హాల్‌లో ఆస్మా బేగం మృతదేహాన్ని, ఇంటి వెనుక గుంతలో ఖాజాపాష మృతదేహాన్ని, హాల్‌లో హసీనా మృతదేహాలను స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంట్లో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినట్లు సమాచారం.