కడుపుబ్బా నవ్విస్తుంది
‘పెళ్లి అనేది అందరూ రిలేట్ చేసుకునే అంశం. అలాగే ఈ కథలో కామెడీతోపాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి. అందుకే ఈ కథను మా తొలి సినిమా కథగా ఎంపిక చేసుకున్నాం.’ అని రాజీవ్ చిలక అన్నారు. అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’.
‘పెళ్లి అనేది అందరూ రిలేట్ చేసుకునే అంశం. అలాగే ఈ కథలో కామెడీతోపాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి. అందుకే ఈ కథను మా తొలి సినిమా కథగా ఎంపిక చేసుకున్నాం.’ అని రాజీవ్ చిలక అన్నారు. అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడు. మే 3న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత రాజీవ్ చిలక గురువారం విలేకరులతో ముచ్చటించారు. ‘ ఈ కథ వినగానే నా మదిలో మెదిలిన హీరో రాజేంద్రప్రసాద్‌గారు. యంగ్‌గా ఉంటే ఈ కథకు ఆయనే పర్ఫెక్ట్. ఇప్పుడైతే నరేశ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. నరేశ్‌గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. పెళ్లి ఆలస్యమవుతుండటంతో డిప్రషన్‌లోకి వెళ్లిపోతుంటారు కొందరు.
ఈ రోజుల్లో ఆర్థికంగా సెటిల్ అవ్వడం కంటే, పెళ్లి అవ్వడం పెద్ద టాస్క్. ఒకప్పుడు చుట్టాలూ, పక్కాలు అందరూ కలిసి సంబంధాలు సెట్ చేసేవారు. ఇప్పుడు వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో ఉంటూ, పెళ్లికోసం వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. వాటిపైనే ఆధారపడిపోతున్నారు. మ్యాట్రీమొనీ సైట్స్ ద్వారా ప్రస్తుతం లక్షల పెళ్లిల్లు జరుగుతున్నాయి. అలా ఒక్కటైన జంటల్లో చాలామందికి ఒకరి గురించి ఒకరికి తెలీదు. ఈ నేపథ్యంలో హ్యూమర్, ఎమోషన్స్ నడుమ సాగే మంచి కథ ఇది.’ అని తెలిపారు చిలక రాజీవ్.
‘ఆ ఒక్కటీ ఆడక్కు’ టైటిల్‌ని నరేశే సూచించారనీ, పెళ్లి అవ్వక బాధపడుతున్న హీరోను, పెళ్లెప్పుడని అందరూ అడుగుతుంటే.. సహజంగా పలికే డైలాగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనీ. ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అనీ, పైగా నరేశ్‌గారి నాన్నగారి సూపర్‌హిట్ సినిమా టైటిల్ కావడంతో ఆ సెంటిమెంట్ కూడా కలిసొచ్చిందని రాజీవ్ చిలక చెప్పారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మనసుపెట్టి పనిచేశారనీ, రెండున్నర గంటలపాటు అందర్నీ కడుపుబ్బ నవ్వించే సినిమా ఇదని చిలక రాజీవ్ నమ్మకం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

