ములుగు : సెలవుపై ఇంటికి వచ్చిన కానిస్టేబుల్(constable) ప్రమాదవాశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించిన ఘటన ములుగు జిల్లా(Mulugu District)లో చోటు చేసుకుంది. జిల్లాలోని వాజేడు మండలం శ్రీరామ్‌నగర్ గ్రామానికి చెందిన తాటి మహేందర్ (30) అరుణాచల్‌ప్రదేశ్(Arunachal Pradesh)లో ఇండో టిబెటియన్( Indo-Tibetan )బోర్డర్ పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇటీవల ఆయన సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. శనివారం ఇంటిలోని కూలర్లో నీళ్లు పోస్తుండగా విద్యుత్ షాక్(Electric shock) కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, మూడునెలల బాబు ఉన్నారు. ఏటూరు నాగారం పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.