అల్లాదుర్గం : పెళ్లి బాజాలు మోగాల్సిన చోట, చావు డప్పు మోగిన విషాదకర ఘటన మెదక్( Medak) జిల్లా అల్లాదుర్గం మండలం బహిరన్‌దిబ్బలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బహిరన్‌దిబ్బ గ్రామానికి చెందిన నడిమింటి నాగయ్య(50) పెద్ద కూతురు తేజ వివాహం ( Wedding ) ఈనెల 21న జరగాల్సి ఉంది. అందుకు నాగయ్య అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు.
ఇంతలోనే గురువారం ఉదయం హార్ట్ ఎటాక్‌తో ( Heart attack ) మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతుడి చిన్న కూతురు అశ్విని తండ్రికి తలకొరివి పెట్టింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల్లో రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు కాదిరాబాద్ రమేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.