హైదరబాద్: భారీ వర్షాల నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై (NH 44) ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) అయింది. వరద ఉధృతికి భిక్నూర్ సమీపంలో జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు జంగంపల్లి నుంచి టెక్రియాల్ వరకు 12 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ అలర్ట్ (Traffic Alert) జారీ చేశారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు జాతీయ రహదారిపై (Nagpur Highway) వెళ్లే భారీ వాహనాలను మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. ఇతర వాహనాలను తూప్రాన్ వద్ద దారి మళ్లించనున్నట్లు (Traffic Diversions) వెల్లడించారు. కామారెడ్డి, డిచ్పల్లి, ఆర్మూర్ మధ్య రహదారి కొట్టుకుకోవడంతో వాహనాలను దారిమళ్లిస్తున్నట్లు వెల్లడించారు.
భారీ వాహనాలు..
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద దారి మళ్లించనున్నారు. అక్కడి నుంచి సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మేట్పల్లి, ఆర్మూర్, ఆదిలాబాద్‌కు చేరుకోవచ్చు.
ఇతర వాహనాలు..
హైదరాబాద్ నుంచి ఎన్‌హెచ్ 44పై ఆదిలాబాద్ వైపు వెళ్లే ఇతర వాహనాలను తూప్రాన్ వద్ద దారి మళ్లిస్తారు. మేడ్చల్, తూప్రాన్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్‌కు చేరుకోవచ్చు.
దీనికి అనుగుణంగా వాహనదారులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. భారీ వాహనాలు, ఎక్కువ దూరం ప్రయాణించేవారు దారి మళ్లింపులను తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు.