Sankranthi | హైదరాబాద్ – విజయవాడ రహదారిపై కొనసాగుతోన్న రద్దీ.. ఏపీకి తరలివెళ్లిన 1,43,000 వాహనాలు
Sankranthi | సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణవాసులందరూ పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ, కర్నూల్, తమిళనాడు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
Sankranthi | హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణవాసులందరూ పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ, కర్నూల్, తమిళనాడు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మెదిగా కదులుతున్నాయి. తుప్రాన్‌పేట నుంచి పంతంగి టోల్ ప్లాజా వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆందోల్ మైసమ్మ, చౌటుప్పల్‌లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వాహనాలను 11 టోల్ గేట్ల ద్వారా టోల్ సిబ్బంది అనుమతిస్తున్నారు. శుక్ర, శనివారం రెండు రోజుల్లో టోల్ ప్లాజా నుంచి ఏపీ వైపునకు 1,43,000 వాహనాలు తరలివెళ్లాయి. రైళ్లల్లో రిజర్వేషన్ దొరక్కపోవడం, ప్రయివేటు బస్సుల్లో ఛార్జీలు భారీగా ఉండడంతో చాలా మంది సొంత వాహనాలు, బైక్‌లపైనే సొంతూళ్లకు వెళ్తున్నారు.
రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న వారితో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్ వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. ఆర్టీసీ బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

