హైదరాబాద్, సెప్టెంబర్06 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం గాంధీ భవన్లో జరుగనుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో పార్టీ పరంగా తాజా పరిస్థితులపై చర్చించనున్నట్టు వెల్లడించాయి.