హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : ‘గనుల శాఖ మంత్రి నువ్వే కదా..! సింగరేణి నైని కోల్‌బ్లాక్ టెండర్ల వ్యవహారంపై చర్చలకు రావాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై బుధవారం గాంధీభవన్‌లో మహేశ్‌కుమార్ స్పందించారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతల మా దిరిగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వాటితో పాటు పదేండ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.