హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘స్థానిక సంస్థల ఎన్నికలపై మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు ముందుకెళ్తారు’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభు త్వం నడుచుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో బుధవా రం ఆయన మీడియాతో వివిధ అంశాలపై చిట్‌చాట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకాకుండా బీజేపీ అ డ్డుకుంటున్నదని ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కనీసం కేంద్రం మీద ఒత్తిడి చేయడమే లేదని చెప్పారు.
ఇప్పటికీ కాంగ్రెస్ 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మంచి మెజార్టీతో విజయం సాధిస్తామ ని ధీమా వ్యక్తంచేశారు. టీపీసీసీ అధ్యక్షుడి పదవికే తాను మొగ్గుచూపుతాన ని, మంత్రి పదవిపై ఆశలేదని తెలిపా రు. క్యాబినెట్ కూర్పులో సీఎం, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం తన కోసం చేసింది కాదని తెలిపారు. సీఎం రేవంత్‌తో సఖ్యతతోనే పనిచేస్తున్నానని తెలిపారు.
డీసీసీ అధ్యక్షుల ప్రకటన ఏ క్షణమైనా రావొచ్చని వివరించారు. బీహార్‌లో మహాఘట్ బంధన్ గెలుస్తుందని నమ్మ కం ఉన్నదని చెప్పారు. త్వరలో ఓట్ చోరీపై పార్టీ కమిటీ వేస్తుందని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో బాపుబాట ప్రచార రథాన్ని మహేశ్‌కుమార్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గాంధీజ్ఞాన్ ప్రతిష్ఠాన్ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్‌రెడ్డి, స్వర్ణోత్సవాల కమిటీ వైస్‌చైర్మన్ కొత్తపళ్లి శ్రీనివాసరెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ పాల్గొన్నారు.