హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ‘సర్’ పేరిట ఓట్లు తొలగించే ప్రమాదం పొంచి ఉన్నదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం నుంచి తెలంగాణ ఓట్ చోరీ సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతుందని వెల్లడించారు. సోమవారం ఓట్ చోరీని నిరసిస్తూ గాంధీభవన్ ఎదుట యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికలు జరగాలని కోరారు. ఓట్ చోరీపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాహుల్‌గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు.