ఆదిలాబాద్ : కుమ్రం భీం(Kumram Bheem) వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో రేపు విద్యా సంస్థలకు(Educational institutions) ప్రభుత్వం సెలవు(Holiday) ప్రకటించింది. ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్ ఉత్వర్వులు జారీ చేశారు. రేపటికి బదులు నవంబర్ 9న రెండో శనివారం విద్యా సంస్థలు పని చేయనున్నాయి. కాగా, తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబులను ఎదురించిన కుమ్రం భీం దేశం గర్వించదగ్గ మహోయోధుడు.
అడవి బిడ్డల హక్కులైన ‘జల్,జంగల్, జమీన్’ కోసం విరోచితంగా పోరాడిన యోధుడు. ఆదివాసీల స్వయం పాలన కోసం ఆయన చేసిన జోడేఘాట్ తిరుగుబాటు మహోజ్వల చరిత్రగా నిలిచింది. స్వయం పాలన ఉద్యమానికి పితామహుడిగా నిలిచిన కుమ్రం భీం చరిత్రను భావిత తరాలకు అందించేం దుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్రంభీం చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడమే కాకుండా జయంతి, వర్ధంతి ని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.