హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా శుక్రవారం బొగ్గు గనులను వేలం వేయనున్నారు. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి వేలాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల సహాయమంత్రి సతీశ్చంద్ర దూబే, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, బొగ్గుశాఖ కార్యదర్శి అమృత్లాల్మీనా పాల్గొంటారు. మొత్తం 60 గనులను వేలం వేస్తారు. ఇందులో తెలంగాణ నుంచి ఒక గని కూడా ఉన్నది. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనడం లేదు.