హైదరాబాద్, మార్చి12 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6,7,8,9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సోమవారంతో దరఖాస్తుల గడువు ముగియనున్నట్టు గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో 9వ తరగతిలో, వికారాబాద్ జిల్లా పరిగి, ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో 8వ తరగతిలో ప్రవేశానికి సోమవారంతోనే దరఖాస్తుల గడువు ముగియనున్నదని పేర్కొన్నారు. పాఠశాలల వారీగా ఖాళీల వివరాలను www.tswreis.ac.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులు రాతపరీక్ష కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.