హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమితులైన కే శ్రీనివాస్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను హైదరాబాద్ బషీర్‌బాగ్ పాత ప్రెస్‌క్లబ్‌లోని సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.