హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమలు చేసిన రైతు సం క్షేమ విధానాల ఫలితంగా బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. 2015లో 1,209 ఆత్మహత్యలు జరుగుగా.. 2023లో ఆ సంఖ్య 48కి తగ్గిందని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) బుధవారం విడుదల చేసిన నివేదిక సైతం ఇదే విషయాన్ని వెల్లడించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పంట పెట్టుబడి సాయం అందించే రైతు బంధు, రైతుబీమా, సమగ్ర పంటల బీమా తదితర పథకాలు రైతు కుటుంబాలపై ఆర్థిక, మానసిక భారాన్ని గణనీయంగా తగ్గించాయని గుర్తుచేశారు. కేసీఆర్ అమలు చేసిన కార్యక్రమాలు రైతులకు భద్రత కల్పించడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని వివరించారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ మాడల్ ఇప్పుడు దేశమంతటికీ ఆదర్శంగా నిలిచిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.