Droupadi Murmu | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాష్ర్టానికి రానున్నారు. ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించే ఈశాన్య రాష్ర్టాల భారతీయ కళా మహోత్సవంను ప్రారంభిస్తారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్గా మంత్రి సీతకను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగనంపడం వరకు ఆమె వెంట సీతక్క ఉండనున్నారు.