కొత్తపల్లి, డిసెంబర్ 22 : ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, ఉద్యమాలు ఉద్యోగులకు కొత్త కాదని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం కరీంనగర్ జిల్లాకు వచ్చిన ఆయనను జేఏసీ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి తమ ఇబ్బందులను వివరించారు. డీఏ, పీఆర్సీ, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, రిటైర్మ్ంట్ బెనిఫిట్స్, తదితర సమస్యలను ఆయనకు వివరించగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్ తదితరులు పాల్గొన్నారు.