హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. శనివారం ఒక్కరోజే 90,211 మంది భక్తులు దర్శించుకున్నారు. మూడు రోజుల్లో 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
శ్రీవారి సేవలో ఎన్నారైలు తిరుమల శ్రీవారికి సేవ చేసేందుకు పలు దేశాలకు చెందిన ఎన్నారైలు స్వచ్ఛందంగా వస్తున్నారని టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు. అదనపు ఈవో వెంకయ్యచౌదరితో ఏర్పాటు చేసిన సమావేశంలో 14దేశాలకు చెందిన ఎన్నారైలు వర్చువల్గా హాజరయ్యారు.