హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి వెలుగుచూసింది. అన్యమత ప్రచార స్టిక్కర్‌తో ఉన్న కారును గురుడాద్రి క్వార్టర్స్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు నిలిపారు. ఇది చూసినా భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కారు తిరుపతి నుంచి తిరుమలకు వచ్చింది. అన్యమతానికి సంబంధించి ఎటువంటి ప్రచారం, స్టిక్కర్లు గానీ తిరుమలకు అనుమతించే ప్రసక్తే ఉండదు. కానీ, భద్రతా సిబ్బంది ఈ కారును ఎలా అనుమతించారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.