హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ): తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇక సులువుగా మారనుంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కేవలం గంటలోపే దర్శనం పూర్తి కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దర్శనాలు పూర్తి చేసేలా టీటీడీ అధికారులు సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు.
గురువారం నుంచి వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు ఎక్స్‌వేదికగా టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే ఈనెల 24న జరిగే పాలక మండలి సమావేశంలో ఆమోదం తెలపనున్నట్టు చెప్పారు.