Congress Leaders | హైదరాబాద్, మే 23 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, కడియం శ్రీహరి నికార్సైన మాదిగలు కారని, వారు మాదిగ ఉపకులానికి చెందినవారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు.
సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన తనతోపాటు కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), వేముల వీరేశం (నకిరేకల్), తోట లక్ష్మీకాంతారావు (జుక్కల్), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్(ధర్మపురి), కాలే యాదయ్య (చేవెళ్ల)లలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదని ఆయన స్పష్టంచేశారు. అనంతరం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాశామన్నారు. మాల సామాజిక వర్గానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు.