హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ షేక్‌పేటలో ప్రచారం చేస్తున్న నిరుద్యోగ యువకుడు టేకుల దినేశ్‌పై కేసు పెట్టడాన్ని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు తీవ్రంగా ఖండించారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉంటుందని పేర్కొన్నారు.
హామీలు నెరవేర్చమని అడిగిడినందుకు నిరుద్యోగులపై కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో హరిబాబు, నవీన్, నితిన్, విశాల్, దినేశ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.