వానకాలానికి విత్తనాలు సిద్ధం చేయండి
వానకాలానికి అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలని, రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీసుశాఖతో సమన్వయం చేసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
- అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): వానకాలానికి అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలని, రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీసుశాఖతో సమన్వయం చేసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం విత్తన కంపెనీలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వానకాలంలో 134.66 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశముండగా, దానికి 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని, ప్రస్తుతం 38.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరానికి రెండింతలు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
52 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, ఇందుకోసం 104 లక్షల ప్యాకెట్లు అవసరం కాగా 212.11 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధులు మంత్రి తుమ్మలతో భేటీ అయ్యారు. రైతులకు సాగుకు ముందుగానే వాతావరణ పరిస్థితులు, వర్షపాతం వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు ప్రభుత్వ సహకారం అందించాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని మంత్రి తుమ్మల ఆదేశించారు.
డిమాండ్ వరి రకాలనే అభివృద్ధి చేయాలి: రైస్ మిల్లుల ప్రతినిధులు
మార్కెట్లో డిమాండ్ ఉన్న, ఎగుమతులకు అవకాశాలున్న వరి రకాలను అభివృద్ధి చేయడంపై వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని రాష్ట్ర రైస్ మిల్లుల ప్రతినిధులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తిచేశారు. గురువారం రైస్ మిల్లుల రాష్ట్ర సంఘ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు.
ఎంటీయూ1010, కేఎన్ఎం118, ఐఆర్64 వంటి రకాలకు మారెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ, ఎగుమతులు మాత్రం ఇంకా పొడవైన గింజలున్న రకాలు పండించే పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే అధికంగా జరుగుతున్నాయని వారు మంత్రికి వివరించారు. తెలంగాణలో సన్న రకాలుగా పరిగణించే కొన్ని వరి రకాలు ఎఫ్సీఏ గ్రేడ్ ‘ఏ’లోకి రావడం లేదని, ఆ అంశాన్ని పరిశీలించాల్సిందిగా మిల్లర్లు అభ్యర్థించారు. అందరి అభిప్రాయాలు పరిశీలించి, వరి సన్న రకాల ఎంపికను శాస్త్రీయం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

